Header Banner

విమానంలో ప్రయాణికుడికి తీవ్ర అస్వస్థత.. ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రి కోడలు.! అసలేం జరిగిందంటే..

  Tue Apr 15, 2025 12:51        Politics, Travel

విమాన ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడి ప్రాణాలను మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి సమయస్ఫూర్తితో కాపాడారు. శనివారం రాత్రి ఇండిగో విమానంలో జరిగిన ఈ సంఘటనలో, ఆమె చేసిన సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) వృద్ధుడికి పునర్జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. శనివారం అర్ధరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, 74 ఏళ్ల వయసున్న ఓ ప్రయాణికుడు  తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయన అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో పాటు, నోటి నుంచి ద్రవం బయటకు రావడం ప్రారంభమైంది. దీంతో తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

 

ఇది కూడా చదవండి: తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రీతి రెడ్డి ఈ పరిస్థితిని గమనించి తక్షణమే స్పందించారు. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె, ఆ వృద్ధుడిని ప్రాథమికంగా పరీక్షించారు. ఆయన రక్తపోటు (బీపీ) బాగా తగ్గిపోయిందని నిర్ధారించుకున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే సీపీఆర్ ప్రక్రియను ప్రారంభించారు. కొంత సమయం పాటు ఆమె చేసిన ప్రయత్నం ఫలించి, వృద్ధుడి పరిస్థితి కొంత మెరుగుపడింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే, విమానాశ్రయ సిబ్బంది ఆ వృద్ధుడిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Dr.PreetiReddy #CPR #IndigoAirlines #MedicalEmergency #AirTravelCardiopulmonary #ResuscitationDoctor #savespassenger #Mallareddy'sdaughter-in-law #In-flightmedicalassistance